Drugs Seized: హైదరాబాద్ మెహదీపట్నంలోని మాదకద్రవ్యాలు కలిగిఉన్న ఇద్దరిని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా రిలయన్స్ కోహినూర్ అపార్ట్‌మెంట్‌లోని షోయబ్ ఖాన్ ఇంటిపై దాడులు చేసి మత్తు పదార్థాలు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మెహదీపట్నంలో నివాసముంటున్న ముబాసిర్ అహ్మద్‌ను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా మత్తు పదార్థాలు లభ్యమయ్యాయి. అతని అనుచరుడు అర్బాజ్‌ను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. షోయబ్ చెప్పినందుకే తాము డార్క్ వెబ్ సైట్‌ల ద్వారా మత్తు పదార్థాలు తెప్పించినట్టు నిందితులు ఎక్సైజ్ పోలీసులకు తెలిపారు.