తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రమాదవశాత్తు బావిలో పడి.. ఇద్దరు మృతి - two fell in well and died

ఏపీలోని చిత్తూరు జిల్లాలో బావిలో పడి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనతో ఒక్కసారిగా మృతుల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అటవీశాఖాధికారులు బావిలోని శవాలను వెలికితీశారు.

ప్రమాదవశాత్తు బావిలో పడి.. ఇద్దరు మృతి
ప్రమాదవశాత్తు బావిలో పడి.. ఇద్దరు మృతి

By

Published : Feb 23, 2021, 9:09 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా పీలేరు మండలం థానావడ్డిపల్లె గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఉన్న బావిలో దాహార్తి తీర్చుకునేందుకు వెళ్లిన రెడ్డి శేఖర్ (13) అనే బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. అక్కడే ఉన్న కొండమ్మ(28) అనే మహిళ.. బాలుడిని కాపాడేందుకు బావిలో దూకింది. ఇద్దరూ మృతి చెందారు.

బావిలో నుంచి మృతదేహాలను అటవీ శాఖాధికారులు బయటకు తీశారు. మృతులు పశువుల కాపరులుగా తెలుస్తోంది. గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందటంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి

ABOUT THE AUTHOR

...view details