తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రమాదవశాత్తు రైలు ఢీకొని.. విధుల్లో ఉన్న ఇద్దరు ఉద్యోగులు మృతి - తెలంగాణ వార్తలు

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్​లో ఇద్దరు రైల్వే ఉద్యోగులు మృతి చెందారు. రోజూలాగే ఉద్యోగులు ట్రాక్​కు రంగులు వేస్తుండగా రైలు ఢీకొంది. రైలు రావడం గమనించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని రైల్వే పోలీసులు గుర్తించారు.

Two on duty employees were dead with a train accident, train accident
రైలు ఢీకొన్ని ఇద్దరు రైల్వే ఉద్యోగులు మృతి, రైలు ఆక్సిడెంట్

By

Published : May 7, 2021, 2:11 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్​ శివారులో ట్రాక్​కు రంగులు వేస్తున్న ఇద్దరు రైల్వే ఉద్యోగులు ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతిచెందారు. ఉదయం 6 గంటలకే విధుల్లో చేరిన పాషా, కమలాకరాచారిలు అప్​లైన్ మహబూబాబాద్ నుంచి కాజీపేట మార్గంలో ట్రాక్​పై పనులు చేస్తుండగా... మూల మలుపు 434/0 మైలురాయి వద్ద కమలాకరాచారి, 434 /15 మైలురాయి వద్ద పాషాలను కోణార్క్ ఎక్స్​ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందారు.

విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి... విచారణ చేపట్టారు. మూలమలుపు వద్ద హారన్ కొట్టకపోవడంతో విధుల్లో ఉన్న ఉద్యోగులు గమనించకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందని గుర్తించారు. ట్రాక్​పై మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైల్వే ఉద్యోగులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details