తెలంగాణ

telangana

ETV Bharat / crime

Bribe: అనిశా వలలో భూకొలతలశాఖ ఏడీ, జూనియర్‌ సహాయకుడు

వ్యవసాయ భూమి విషయంలో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చినా సరే ఆ అధికారులు వెనక్కు తగ్గలేదు. లంచం ఇస్తేనే పని జరుగుతుందని.. నివేదిక ఇవ్వడంలో తాత్సారం చేస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో ఆమె అనిశా అధికారులను ఆశ్రయించింది.

two officials accepting bribe
అనిశా వలలో అధికారులు

By

Published : Nov 2, 2021, 9:52 AM IST

భూకొలతల శాఖ సహాయ సంచాలకుడు(ఏడీ), జూనియర్‌ సహాయకుడు అనిశా(ఏసీబీ) వలలో చిక్కిన ఘటన సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పటాన్‌చెరు మండలం నందిగామకు చెందిన ఓ మహిళ తన 1.29 ఎకరాల వ్యవసాయ భూమిని సర్వే చేయాలని కోరినా అధికారులు పట్టించుకోలేదు.

దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం సర్వే చేసి మహిళకు నివేదిక ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. ఈ ఏడాది సెప్టెంబరులో అధికారులు సర్వే చేసినప్పటికీ.. నివేదిక ఇవ్వడంలో తాత్సారం చేస్తున్నారు. ఇందుకోసం రూ.20 వేలు ఇవ్వాలని భూకొలతల శాఖ ఏడీ మధుసూదన్‌రావు, జూనియర్‌ సహాయకులు అసిఫ్‌ డిమాండ్‌ చేశారు. దీంతో ఆమె అనిశా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం భూకొలతల శాఖ కార్యాలయంలో ఏడీ, జూనియర్‌ సహాయకుడికి ఆమె రూ.20 వేలు ఇస్తుండగా పట్టుకున్నామని డీఎస్పీ వెల్లడించారు.

ఇదీ చూడండి:ACB caught Sub registrar: రూ.20 వేలు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్

ABOUT THE AUTHOR

...view details