తెలంగాణ

telangana

ETV Bharat / crime

Two Murders: సహజీవనం చేస్తున్న మహిళ వేరే వ్యక్తితో వెళ్లిపోయిందన్న కోపంతో హత్యాకాండ.. - సహజీవనం చేస్తున్న మహిళ వేరే వ్యక్తితో వెళ్లిపోయిందన్న కోపంతో హత్యాకాండ

Two Murders: సమాజానికి కట్టుబడని బంధాలు ఎప్పటికైన విషాదాన్నే మిగుల్చుతాయి. అయినా మనసు మాట వినదంటూ కొందరు చేసే తప్పిదాలు చివరకు ప్రాణాల మీదకి వస్తాయి. అలాంటి కోవకే చెందిన ఓ ఘటన ఇద్దరి ప్రాణాలను బలితీసుకోగా, మరో వ్యక్తిని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేసింది. మహిళతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి... ఆమె వేరే వ్యక్తితో వెళ్లిపోయిందన్న కోపంతో హత్యాకాండకు తెగబడిన ఘటన కలకలం రేపింది.

MURDER
MURDER

By

Published : Jan 23, 2022, 3:30 PM IST

సహజీవనం చేస్తున్న మహిళ వేరే వ్యక్తితో వెళ్లిపోయిందన్న కోపంతో హత్యాకాండ

Two Murders: ఏపీలోని నెల్లూరు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. కలిగిరి మండలం అంబటివారిపాలెంలో మీరాంబీ, ఆమె కుమారుడు అలీఫ్‌ను ఒంగోలుకు చెందిన షేక్‌ రబ్బానీ దారుణంగా హత్య చేశాడు. తల్లి, కుమారుడిని చంపిన తర్వాత షేక్‌ రబ్బానీ ప్రకాశం జిల్లా ఒంగోలు వెళ్లి... కత్తితో కాశీరావు అనే యువకుడిపై దాడి చేశాడు. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ రబ్బానీని పట్టుకున్నాడు. క్షతగాత్రుడ్ని రిమ్స్‌కు తరలించి ప్రాథమికి చికిత్స అందించారు. అనంతరం ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

ఓ మహిళ కారణంగానే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. కలిగిరి మండలానికి చెందిన మహిళ భర్తతో విడిపోయి... తన సమీప బంధువైన రబ్బానీతో 10 ఏళ్ల నుంచి సహజీవనం చేస్తోంది. వారిద్దరూ కలిసి ఒంగోలులో ఓ టీ దుకాణం నడిపేవారు. దుకాణంలో పనిచేసే కాశీరావుతో మహిళకు వివాహేతర సంబంధం ఏర్పడి.. అతడితో వెళ్లిపోయింది. తనతో సహజీవనం చేస్తున్న మహిళ వెళ్లిపోయేందుకు ఆమె వదిన మీరాంబీ సహకరించిందని తెలిసి రబ్బానీ కక్షపెంచుకున్నాడు. సమయం చూసి మీరాంబీతో పాటు ఆమె కుమారుడిని చంపేశాడు. అనంతరం ఒంగోలు వచ్చి కాశీరావుపైనా కత్తితో దాడి చేశాడు. ఓ మహిళ వివాహేతర సంబంధం ఆమె వదిన కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details