తెలంగాణ

telangana

ETV Bharat / crime

అప్పు చెల్లించలేదని బండిని తగులబెట్టాడు - జగిత్యాల జిల్లా తాజా నేర వార్తలు

ఓ వ్యక్తి తీసుకున్న అప్పు చెల్లించలేదనే కోపంతో అతని ద్విచక్రవాహనంతోపాటు.. తన వాహనానికి నిప్పు అంటించాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

Burning bikes
దగ్ధమవుతున్న బైకులు

By

Published : Mar 18, 2022, 11:00 PM IST

జగిత్యాల జిల్లా కోరుట్లలో ఒక వ్యక్తి తీసుకున్న అప్పు చెల్లించడం లేదన్న ఆగ్రహంతో రెండు ద్విచక్రవాహనాలు దగ్దం చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. కోరుట్లకు చెందిన తిరుపతి కొద్దిరోజుల క్రితం తాండ్రియాలకు చెందిన గంగాధర్ నుంచి 28వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పు చెల్లించమని గంగాధర్‌ పలుసార్లు అడిగినా పట్టించుకోలేదు.

గంగాధర్‌ ఆగ్రహించి ఓ షాపులో తిరుపతి కూర్చొని ఉండగా అతని ద్విచక్రవాహనంతో పాటు తన వాహనాన్ని నడ్డిరోడ్డున డివైడర్‌ వద్ద నిప్పంటించాడు. దీంతో రెండు వాహనాలు కాలి బూడిదయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే వాహనాలను దగ్ధం చేసిన గంగాధర్‌ను అదుపులో తీసుకున్నారు.

ఇదీ చదవండి: స్నేహితులతో సరదాగా స్నానానికి వెళ్లి.. చెరువులో గల్లంతయ్యాడు..

ABOUT THE AUTHOR

...view details