భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో వలస ఆదివాసి గ్రామం అశ్వాపురంపాడుకి చెందిన పోడియం దేవయ్య, సంగీత దంపతులకు రెండు నెలల కిందట బాబు జన్మించాడు. సోమవారం రాత్రి చిన్నారి ఏడుస్తూ ఉండడంతో కడుపు నొప్పితో బాధ పడుతున్నాడని భావించి నాటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు.
వైద్యం పేరుతో శిశువు నాబిని కొరికేశాడు.. బాబు చనిపోయాడు! - భద్రాద్రి కొత్తగూడెం తాజా వార్తలు
మూఢనమ్మకం ఓ పసి ప్రాణాన్ని చిదిమేసింది. అశాస్త్రీయ వైద్యం కారణంగా ఓ చిన్నారికి రెండు నెలలకే నూరేళ్లు నిండాయి.
two-month-old-boy-died-due-to-medical-malpractice
నాటు వైద్యుడు.. చికిత్సలో భాగంగా శిశువు నాబి చుట్టూ కొరికాడు. ఏడుపు ఆపక పోవడంతో పసరు మందు వేశారు. మంగళవారం ఉదయం గ్రామానికి వెళ్లిన ఆశ కార్యకర్త.... చిన్నారిని గుర్తించి వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి భద్రాచలం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు.
ఇదీ చూడండి:Saidabad incident: ఇంకా దొరకని కామాంధుడు.. కారణం అదే.. ఇవిగో సీసీటీవీ దృశ్యాలు..!
Last Updated : Sep 15, 2021, 11:49 AM IST