తెలంగాణ

telangana

ETV Bharat / crime

మైనర్‌ అక్కాచెల్లెళ్లతో శారీరక సంబంధం.. ఇద్దరు యువకులపై పోక్సో కేసు - సికింద్రాబాద్‌లో బాలికలపై అత్యాచారం

Two Minor girls were raped
Two Minor girls were raped

By

Published : Jun 9, 2022, 10:04 AM IST

Updated : Jun 9, 2022, 10:43 AM IST

10:00 June 09

రెండేళ్లుగా బాలికలపై ఇద్దరు యువకుల అత్యాచారం

Two Minor girls were raped : సికింద్రాబాద్ చిలకలగూడలో మైనర్‌ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేసిన ఘటనలో ఇద్దరు యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. చిలకలగూడ పోలీసుల కథనం ప్రకారం.. అంబర్‌పేట్‌కు చెందిన ఇంతియాజ్‌(21), నవాజ్‌(21) యువకులు ఇద్దరు అక్కాచెల్లెళ్లని ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకున్నారు. మొదట స్నేహితులుగా ఉన్న వారు క్రమంగా ఆ యువకుల ప్రేమలో పడ్డారు. వాళ్ల మధ్య సాన్నిత్యం పెరిగి.. ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆ యువకులతో శారీరకంగా కలిశారు. మైనర్ బాలికల తండ్రికి ఈ విషయం తెలిసి యువకులను పలుమార్లు హెచ్చరించారు. తమ కుమార్తెల జోలికి రావొద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు.

అయినా వారు వినకపోవడంతో బాధిత తండ్రి తమను ఆశ్రయించినట్లు పోలీసులు తెలిపారు. మైనర్లయిన తమ కుమార్తెలపై రెండేళ్లుగా నవాజ్‌, ఇంతియాజ్‌లు అత్యాచారం చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Jun 9, 2022, 10:43 AM IST

ABOUT THE AUTHOR

...view details