తెలంగాణ

telangana

ETV Bharat / crime

సరదాగా వాగుకు వెళ్లిన ఇద్దరు.. వరద ఉద్ధృతికి గల్లంతు.! - two men washed away in flood flow

సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో స్థానిక వాగు వద్ద సరదాగా గడపడానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు.. ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

two men washed away in gonepally pond
గొనెపల్లి వాగులో ఇద్దరు గల్లంతు

By

Published : Sep 5, 2021, 8:01 PM IST

శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లడంతో.. సరదా కోసం వాగుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు వరద ప్రవాహానికి గల్లంతయ్యారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

గొనెపల్లి వాగుకు సర్వేస్, జైసింగ్ సరదాగా గడపడానికి వెళ్లారు. ఆ కాసేపటికే ప్రమాదవశాత్తు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న చిన్నకోడూర్ పోలీసులు.. గల్లంతైన వారికోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయినా వారి ఆచూకీ తెలియకపోవడంతో రేపు ఉదయం గాలిస్తామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:MLA Rajaiah viral video: చిన్నారులతో కలిసి బుల్లెట్​ బండి పాటకు స్టెప్పులేసిన తెరాస ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details