Sexual harassment in vishaka:ఓ వివాహితను ఇద్దరు వ్యక్తులు లైంగికంగా వేధించిన ఘటన విశాఖ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. జిల్లాలోని పద్మనాభం మండలానికి చెందిన ఓ వివాహితపై.. అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. పది రోజులుగా తనను లైంగికంగా వేధిస్తున్నారని బాధిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
sexual harassment on woman: గంటా వీరబాబు, పంది దుర్గాప్రసాద్ (హరిబాబు) అనే ఇద్దరు.. గత నెల 21న బహిర్భూమికి వెళ్లిన తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఒక వ్యక్తి తనను బలవంతం చేసేందుకు ప్రయత్నించగా.. మరో వ్యక్తి వీడియోలో చిత్రీకరించాడని మహిళ వాపోయింది. ఎలాగోలా వారిని తప్పించుకుని ఇంటికి చేరుకున్నానని తెలిపింది.