తెలంగాణ

telangana

ETV Bharat / crime

యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారీ - యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారీ

Erragadda Hospital Incident : పాతకక్షలతో ఓ యువకుడిపై ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన హైదరాబాద్‌ ఎస్సార్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాల ఆవరణలో చోటుచేసుకుంది. తీవ్రగాయాలతో బాధితుడు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Erragadda Hospital Incident
Erragadda Hospital Incident

By

Published : Apr 9, 2022, 10:12 AM IST

Erragadda Hospital Incident : హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాల ఆవరణలో శుక్రవారం అర్ధరాత్రి ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. ఆదిల్‌(25) అనే యువకుడిపై మొహమ్మద్, హజార్‌ అనే మరో ఇద్దరు యువకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దాడిలో ఆదిల్ తీవ్ర గాయాలపాలయ్యాడు. మానసిక వైద్యశాల సిబ్బంది సమాచారంలో ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. బాధితుణ్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

హత్యాయత్నంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పాతకక్షలతోనే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే సేకరిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details