Two Men Committed Suicide: భార్యలు తిట్టారని.. ఇద్దరు వ్యక్తుల ఆత్మహత్య - తెలంగాణలో క్రైమ్ వార్తలు
10:41 December 08
పురుగులమందు కలుపుకొని తాగి ఇద్దరు బలవన్మరణం
Two men Committed Suicide: సంగారెడ్డి పాత బస్టాండ్ వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతులు లక్ష్మయ్య, వెంకట్‌గా గుర్తించారు.
గంజిగూడెంకు చెందిన లక్ష్మయ్య, వెంకట్‌పై పలు దొంగతనం ఆరోపణలు వచ్చాయి. ఈ ఇద్దరు దొంగతనం చేశారని.. గ్రామస్థులు పంచాయితీకి పిలిచారు. ఈ పంచాయితీకి వారి భార్యలు కూడా వచ్చారు. గ్రామస్థుల ఆరోపణలు విన్న వారి భార్యలు సైతం.. లక్ష్మయ్య, వెంకట్‌లను తిట్టారు. కట్టుకున్న భార్యలు తమను అర్థం చేసుకోకుండా దూషించారని ఇద్దరు మనస్తాపం చెందారు. సంగారెడ్డి పాత బస్టాండ్ వద్దకు చేరుకుని మద్యంలో పురుగులమందు కలుపుకొని తాగి.. బలవన్మరణం చెందారు.
ఇదీ చూడండి:suicide attempt at jagadevpur : తహసీల్దారు కార్యాలయం ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం