భూపాలపల్లిలో ఇద్దరు సింగరేణి కార్మికులకు గాయాలయ్యాయి. కేటీకే-1వ గనిలో మొదటి షిప్టులో రెండు ప్రమాదాలు జరిగాయి. ఆరుగురు కార్మికులు డ్రిల్స్ మార్చుతుండగా సిమెంట్ పెల్లలు ఊడిపడ్డాయి. ఐదుగురు కార్మికులు తప్పించుకోగా.. జనరల్ మద్దూర్ కార్మికుడు సలీంకు తీవ్రగాయాలయ్యాయి.
Coal Mine Accident: సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం.. ఇద్దరికి గాయాలు - భూపాలపల్లి జిల్లా వార్తలు
భూపాలపల్లి జిల్లాలోని కేటీకే-1వ గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆరుగురు కార్మికులు డ్రిల్స్ మార్చుతుండగా సిమెంట్ పెల్లలు ఊడిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఘటనలో కోల్ కట్టర్ కార్మికుడికి యంత్రం తగలడంతో కాలు విరిగింది.
Coal Mine Accident
మరో ఘటనలో మల్లయ్య అనే కోల్ కట్టర్ కార్మికుడికి యంత్రం తగలడంతో గాయపడ్డాడు. ఇద్దరిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రమాద ఘటనను సింగరేణి అధికారులు గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ చదవండి:Inter Student Suicide : తక్కువ మార్కులొచ్చాయని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య