Accidents in Sangareddy: సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొట్టి కారు బోల్తాపడింది. టోలిచౌక్ నుంచి.. సంగారెడ్డి జంజం దాబాకు వెళ్తుండగా.. పటాన్చెరు పట్టణ సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బషీర్ ఖాధ్రి అనే యువకుడు మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Accidents in Sangareddy: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి - ఇద్దరు మృతి
Accidents in Sangareddy: సంగారెడ్డి జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. పటాన్చెరు జాతీయ రహదారిపై కారు బోల్తా కొట్టి ఒకరు మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు. మరో ఘటనలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణాలు వదిలాడు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
సంగారెడ్డి పాత టోల్గేట్ సమీపంలో.. ద్విచక్రవాహనంపై నుంచి పడి సాయికృష్ణ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతిచెందాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:Mulugu Farmer Suicide Attempt : ధాన్యం బస్తా తగులబెట్టి.. రైతు ఆత్మహత్యాయత్నం