Poison Gas Leak in paravada Ramki pharma city: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పరవాడలోని ఫార్మాసిటీలోని కర్మాగారంలో విషాదం చోటు చేసుకుంది. విషవాయువులు లీకై ఇద్దరు ఉద్యోగులు చనిపోయారు. రాంకీ డెవలపర్స్‌గా ఉన్న పంప్‌హౌస్ వాలు ఓపెన్ చేస్తుండగా విషవాయువులు లీకయ్యాయి. అక్కడే ఉన్న తుని, పాయకరావుపేట ప్రాంతాలకు చెందిన మణికంఠ, దుర్గా ప్రసాద్ అనే ఒప్పంద ఉద్యోగులు విషవాయువులు పీల్చి చనిపోయారు.
Paravada Ramki pharma city: విషవాయువులు లీకై.. ఇద్దరు ఉద్యోగులు మృతి - paravada Ramki pharma city
Poison Gas Leak in paravada Ramki pharma city: పంప్‌హౌస్ వాలు ఓపెన్ చేస్తుండగా.. విషవాయువులు లీకై ఇద్దరు మృతి చెందిన ఘటన ఏపీలోని విశాఖలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలు పెట్టారు.
![Paravada Ramki pharma city: విషవాయువులు లీకై.. ఇద్దరు ఉద్యోగులు మృతి paravada Ramki pharma city, Paravada Ramki pharma city incident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13763497-255-13763497-1638159742505.jpg)
రాంకీ ఫార్మసిటిలో విషాదం
మృతి చెందిన ఇద్దరు కార్మికుల మృతదేహాలని కేజీహెచ్‌కు తరలించారు. రాంకీ యాజమాన్యం (Paravada Ramki Pharma City Incident ) సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే తమ వారు ప్రాణాలు కోల్పోయారని మృతుల కుటుంబ సభ్యులు.. ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.