తెలంగాణ

telangana

ETV Bharat / crime

జాతీయ రహదారిపై కారు, లారీ ఢీ.. ఇద్దరు మృతి - తెలంగాణ వార్తలు

వనపర్తి జిల్లా కనిమెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఏపీలోని కర్నూల్ జిల్లా నుంచి హైదరాబాద్​కు వచ్చి... తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషాద ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు.

two members dead in road accident, kanimetta road accident
కనిమెట్ట రోడ్డు ప్రమాదం, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

By

Published : May 9, 2021, 3:52 PM IST

జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూల్ జిల్లా వేముల మండలం శేషన్నగారిపల్లెకు చెందిన నాగలక్ష్మి హైదరాబాద్​లో కుమారుల వద్ద ఉంటున్నారు. ఆమె కోసం చిన్న కుమారుడు రామానాయుడు అదే గ్రామానికి చెందిన మహేష్ కుమార్ కారును అద్దెకు తీసుకుని హైదరాబాద్​కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కనిమెట్ట వద్ద వేగంగా వస్తున్న కారు... లారీని వెనకనుంచి ఢీకొంది.

ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ మహేష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన నాగలక్ష్మి, రామానాయుడును వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నాగలక్ష్మి మృతి చెందారు. రామానాయుడు పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్​కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగశేఖర రెడ్డి తెలిపారు.

మహేష్ కుమార్ బెంగళూరులో క్యాబ్ నడుపుతూ జీవనం సాగించేవారు. కరోనా నేపథ్యంలో తాడిపత్రికి వచ్చి అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నట్లు అతడి కుటుంబసభ్యులు తెలిపారు. రెండు నెలల క్రితమే వివాహమైందని తెలిపారు. ఈ ఘటనతో మహేశ్ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

ఇదీ చదవండి:' తేదేపా తరఫున పోటీ చేశారని కొట్టి చంపారు'

ABOUT THE AUTHOR

...view details