తెలంగాణ

telangana

ETV Bharat / crime

Suicides: ముషీరాబాద్‌లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య - తెలంగాణ వార్తలు

ముషీరాబాద్‌లో ఇద్దరు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మద్యానికి బానిసై ఒకరు, భార్య పుట్టింటికెళ్లిందని మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు స్థానికంగా కలకలం రేపాయి.

two members suicide, hyderabad crime
ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య, హైదరాబాద్ నేర వార్తలు

By

Published : Jun 30, 2021, 9:40 AM IST

హైదరాబాద్‌ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మద్యానికి బానిసై ఒకరు, భార్య పుట్టింటికెళ్లిందని మరొకరు బలవన్మరణానికి ఒడిగట్టారు. ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తుల ఆత్మహత్య స్థానికంగా కలకలం సృష్టించింది.

ముషీరాబాద్ బాకారంకు చెందిన జూపల్లి ప్రవీణ్ అనే వ్యక్తి తన భార్య పుట్టింటికి వెళ్లిందని మానసిక వేదనకు గురై... ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదే ప్రాంతానికి చెందిన శ్రీకాంతాచారి గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై ఇంట్లోనే ఉరి వేసుకుని ఉసురు తీసుకున్నారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన ముషీరాబాద్ పోలీసులు... దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి:ROAD ACCIDENT: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details