భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలానికి చెందిన మత్తు నాగరాజు, కొమ్మరాజు కనకయ్యగా వీరిని గుర్తించారు. హైదరాబాద్ నుంచి దుమ్ముగూడెం మీదుగా భారీగా పేలుడు పదార్థాలు తీసుకెళ్తుండగా.. పోలీసులు పట్టుకున్నట్లు ఏఎస్పీ డా.వినీత్ తెలిపారు.
ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులు అరెస్ట్ - తెలంగాణ వార్తలు
ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులు పోలీసులకు చిక్కారు. వారి నుంచి 2 సంచుల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ వీరు మావోయిస్టులకు సామాగ్రి అందించే కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు భద్రాచలం ఏఎస్పీ తెలిపారు.
ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులు అరెస్ట్
పోలీసులను చూసి పారిపోతున్న వారిని వెంబడించి పట్టుకున్నారు. వారి నుంచి 2 సంచుల్లో ఉన్న పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ వీరు మావోయిస్టులకు సామాగ్రి అందించే కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు.
ఇదీ చూడండి: సరదాగా బైక్పై వెళ్లిన బాలుడు.. వెంటాడిన మృత్యువు