తెలంగాణ

telangana

ETV Bharat / crime

రెండు లారీలు ఢీ.. డ్రైవర్‌లు మృతి - కుమురం భీం జిల్లా వార్తలు

కుమురం భీం జిల్లా గోలేటి ఎక్స్ రోడ్డు వద్ద.. అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ లారీ.. మరో లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో రెండు లారీల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు.

accident
accident

By

Published : May 19, 2021, 11:50 AM IST

అతి వేగానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. కుమురం భీం జిల్లా గోలేటి ఎక్స్ రోడ్డు వద్ద వేగంగా వచ్చిన ఓ లారీ.. మరో లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇరు లారీలకు చెందిన డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు.

మహారాష్ట్ర నుంచి సుల్తానాబాద్‌కు మొక్కజొన్న లోడుతో వెళ్తోన్న ఓ లారీ డ్రైవర్ వేగంగా వచ్చి.. సిమెంట్ లోడుతో ఎదురుగా వస్తోన్న మరో లారీని ఢీ కొట్టాడు. ఇరు లారీలకు చెందిన డ్రైవర్లు క్యాబిన్​లో ఇరుక్కుపోయి.. ప్రాణాలు విడిచారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు.. మృతదేహాలను వెలికి తీసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

ఇదీ చదవండి:యథేచ్ఛగా సాగుతోన్న అక్రమ మట్టి తవ్వకాల దందా..!

ABOUT THE AUTHOR

...view details