నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) గ్రామం ఎక్స్ రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న తంబాకు పొట్లాలు బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రాం నర్సింహారెడ్డి తెలిపారు. ఆ గ్రామం సమీపంలో రాత్రి వాహనాల తనిఖీల్లో భాగంగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
లక్షల విలువైన అక్రమ గుట్కా స్వాధీనం - అక్రమ గుట్కా స్వాధీనం
రెండు లక్షలకుపైగా విలువైన నిషేధిత గుట్కా పొట్లాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి తనిఖీల్లో భాగంగా వారిని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.
లక్షల విలువైన అక్రమ గుట్కా స్వాధీనం
డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించగా ఆదిలాబాద్ నుంచి బైంసా పట్టణానికి తరలిస్తున్నట్లు వెల్లడించారు. పట్టుబడ్డ నిషేధిత తంబాకు పొట్లాల విలువ రూ.2,22,720 ఉంటుందని వివరించారు. డ్రైవర్ మహమ్మద్ రయిస్, బైంసాకు చెందిన దుకాణ యజమాని వసీపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఇదీ చూడండి :ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య