Two killed steal vegetables: ఓ రైతు పొలంలో కూరగాయలు చోరీ చేసేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై ఇద్దరు కూలీలు మరణించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం చందంపేట గ్రామ శివారులో చోటుచేసుకుంది.
పని ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో..
జోగిపేట ఎస్సై వెంకటేశం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. చందంపేట గ్రామానికి చెందిన చాకలి విఠల్, యాదయ్యలు గ్రామ శివారులోని ఓ కల్లు డిపోలో రోజువారి కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆదివారం రాత్రి కల్లు దుకాణంలో పని ముగించుకొని స్వగ్రామానికి వస్తున్న క్రమంలో ఓ రైతు పొలంలో పండిన కూరగాయలు దొంగతనం చేసేందుకు వెళ్లారు.