undavalli accident : ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది. ప్రమాదంలో ఉండవెల్లి మండలం షేర్పల్లికి చెందిన మద్దిలేటి రెడ్డి, శంకర్ ఘటనా స్థలిలోనే మృతి చెందారు.
undavalli accident : ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి - ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు ఇద్దరు మృతి
undavalli accident : జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
car hits two wheelar at undavalli : మద్దిలేటి రెడ్డి, శంకర్ ద్విచక్రవాహనంపై (AP 21 BC 5504) కర్నూల్ నుంచి షేర్పల్లికి వెళ్తున్నారు. అలంపూర్ చౌరస్తాకు సమీపంలో వీరి బైక్ను కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు (KA 05 NC 0031) వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను అంబులెన్సులో అలంపూర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి:Headless corpse: బొంగులూరు వద్ద తల లేని మృతదేహం లభ్యం