తెలంగాణ

telangana

ETV Bharat / crime

లారీ - కంటైనర్​ ఢీ.. డ్రైవర్ల సజీవదహనం.. - లారీ కంటైనర్ ప్రమాదం

Prathipadu Road Accident Today: ఏపీలోని ధర్మవరం జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కంటైనర్​ ఢీకొని మంటలు చెలరేగాయి. ఘటనలో రెండు వాహనాల డ్రైవర్లు సజీవదహనమయ్యారు.

లారీ - కంటైనర్​ ఢీ.. డ్రైవర్ల సజీవదహనం..
లారీ - కంటైనర్​ ఢీ.. డ్రైవర్ల సజీవదహనం..

By

Published : Dec 2, 2022, 7:50 AM IST

Prathipadu Road Accident Today : ఆంధ్రప్రదేశ్​లోని కాకినాడ జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం జాతీయ రహదారిపై లారీ, కంటైనర్ ఢీకొన్నాయి. కత్తిపూడి వైపుగా ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ అదుపు తప్పి డివైడర్ మీదుగా అవతలి వైపు నుంచి ఎదురుగా వస్తున్న కంటైనర్​ను అతి వేగంగా ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఘటనలో రెండు వాహనాల డ్రైవర్లు సజీవ దహనమయ్యారు.

లారీ - కంటైనర్​ ఢీ.. డ్రైవర్ల సజీవదహనం..

సమాచారం అందుకున్న ప్రత్తిపాడు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇసుక లారీ డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details