జోగులాంబ గద్వాల్ జిల్లా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బొలేరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్యభర్తలు మృతి చెందగా వారి పిల్లలు ఇద్దరికి గాయాలయ్యాయి.
బొలేరోను ఢీ కొట్టిన కారు.. ఇద్దరు మృతి - రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
లారీని అధిగమించే క్రమంలో ఓ కారు బొలేరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్యభర్తలు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లా జాతీయ రహదారిపై జరిగింది.
గద్వాల్ జిల్లా రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి
కడప జిల్లా పులివెందులకు చెందిన మురళీ మోహన్ అతడి భార్య సుజాత హైదరాబాద్ నుంచి తమ సొంతూరుకు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో జోగులాంబ గద్వాల్ ఇటిక్యాల మండలం ధర్మవరం వద్ద లారీని అధిగమించే సమయంలో ఎదురుగా వస్తున్న బొలేరోను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి గాయాలవ్వడంతో స్థానికులు వారిని కర్నూలులోని ఓ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మురళీ మోహన్, సుజాత మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.