తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. లారీ రూపంలో మృత్యువు ఎదురొచ్చి.. - road accidents today

Vikarabad Accident: ఇంకో ఐదు నిమిషాల్లో పొలం నుంచి ఇంటికి చేరుకుంటారనగా.. లారీ రూపంలో మృత్యువు వారిని కబళించింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం తొండపల్లి సమీపంలో లారీ ఢీకొట్టి ఇద్దరు దుర్మరణం చెందారు.

vikarabad accident
vikarabad accident

By

Published : Jan 30, 2022, 12:13 PM IST

Vikarabad Accident: వికారాబాద్ జిల్లా పరిగి మండలం తొండపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్​ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

తొండపల్లికి చెందిన కావలి సుభాన్, గుర్రంపల్లి రాజులు పొలం నుంచి ఇంటికి వస్తుండగా.. షాద్​నగర్​ నుంచి వస్తున్న లారీ వారి బైక్​ను ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మరణించారు. ఇంకో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్​ అక్కడ నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని. మృతదేహాలను పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీచూడండి:Karimnagar Car Accident : గుడిసెల్లోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details