సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
కూలీలపై పిడుగుపాటు.. ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు - two died in thunderbolt strike at lingampalli
మిరపకాయలు తెంచడానికి వెళ్లిన కూలీలపై పిడుగు పడింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.
కూలీలపై పిడుగుపాటు
గ్రామంలోని ఓ చేనులో మిరపకాయలు తెంచడానికి వెళ్లిన కూలీలు.. గాలి వాన, ఉరుములు రావటంతో చెట్టు దగ్గరకి చేరుకున్నారు. ఇంతలో ఒక్కసారిగా చెట్టుపై పిడుగుపడింది. దీంతో వీరబోయిన బిక్షం, కారింగుల ఉమా.. అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. వీరికి మెరుగైన చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: రెమ్డెసివర్ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయించే ఏడుగురు అరెస్ట్