ఏపీలోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం పార్వతీపురంలో ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న బొలేరో వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. 20మంది గాయపడ్డారు.
ఏపీలో ఘోర ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి - guntur accident news
ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న బొలేరో వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మృతిచెందగా.. 20మందికి గాయాలయ్యాయి.
![ఏపీలో ఘోర ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి two-killed-and-20-labours-were-injured-in-road-accident-occured-at-guntur-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10737961-516-10737961-1614042403177.jpg)
ఏపీలో ఘోర ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి
వీరయ్య, శ్రీనివాస్, డ్రైవర్ మృతి చెందారు. ప్రమాద సమయంలో వాహనంలో 30 మంది ఉన్నారు. బాధిత కూలీలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులకు వినుకొండ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరంతా పనుల కోసం గుంటూరు వస్తున్నారు.
ఇదీ చదవండి:మర్మాంగాలకు కోడి కత్తి తగలడంతో వ్యక్తి మృతి