కొవిడ్ మహమ్మారి నిజామాబాద్ జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. వైరస్ సోకి నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలో ఇద్దరు జర్నలిస్టులు మృతి చెందారు. ధర్పల్లికి చెందిన అల్లాడి శేఖర్ (48), ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ వేణుగోపాల్ (49) మహమ్మారికి బలయ్యారు. వారం రోజుల క్రితం పాజిటివ్ నిర్ధరణ కాగా.. వీళ్లిద్దరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయి ఇద్దరు మరణించారు.
కరోనాతో ఇద్దరు పాత్రికేయులు మృతి
రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు జర్నలిస్టులు వైరస్‌కు బలయ్యారు.
జర్నలిస్టులు మృతి, కరోనాతో జర్నలిస్టులు మృతి, నిజామాబాద్‌లో కరోనా కేసులు
వీరి మృతిపట్ల రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రజలంతా భౌతిక దూరం పాటిస్తూ.. స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని సూచించారు. వైరస్ బారిన పడి మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని పలు పాత్రికేయ సంఘాలు విజ్ఞప్తి చేశాయి.
- ఇదీ చదవండి :రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
Last Updated : Apr 24, 2021, 11:36 AM IST