వికారాబాద్ జిల్లా కుల్కచర్ల శివారులో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు గాయపడ్డారు.
బైక్ను ఢీకొట్టిన కారు.. ఇద్దరికి గాయాలు - vikarabad district crime news
సెల్ఫోన్ మాట్లాడుతూ కారు డ్రైవ్ చేస్తున్న ఓ వ్యక్తి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు గాయపడ్డారు.
వికారాబాద్లో ప్రమాదం, పరిగిలో ప్రమాదం
పరిగి నుంచి సల్కర్పేట్కు ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకులను.. కుల్కచర్ల వద్ద కారు ఢీకొట్టింది. కారు డ్రైవర్ సెల్ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక ప్రజలు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత కారు డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
- ఇదీ చదవండి :కరోనా చికిత్సకు ఆయుర్వేద మందు కోసం పోటెత్తిన జనం