Two Injured in Explosion at Dumping Yard: హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్ వద్దనున్న జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డులో గురువారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కాగితాలు ఏరుకునే ఓ వ్యక్తికి, అతడి కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి రోజు డంపింగ్‌యార్డులో తండ్రి చంద్రన్న(45), సురేశ్(14) చెత్తకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
Hyderabad Crime News: డంపింగ్ యార్డ్‌లో పేలుడు.. ఇద్దరికి గాయాలు - క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలింపు
Two Injured in Explosion at Dumping Yard: హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద డంపింగ్ యార్డ్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కాగితాలు ఏరుకునే తండ్రి, కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరినీ చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పేలుడులో గాయపడిన కుమారుడి పరిస్థితి విషమంగా వైద్యులు చెబుతున్నారు. డంపింగ్ యార్డ్‌లో పేలుడుకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Dumping Yard
యథావిధిగా గురువారం చెత్త ఏరుతుండగా పెయింట్ డబ్బాలను కదిలించారు. దీంతో పేలుడు సంభవించి చంద్రన్న తలకు గాయంకాగా.. కుమారుడు సురేశ్‌కు చేయి విరిగింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని డాగ్‌స్క్వాడ్‌తో నిశితంగా పరిశీలించారు. ఇద్దరు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి తదితరులు పరిశీలించారు. ఈమేరకు ఇన్‌స్పెక్టర్ మోహన్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డంపింగ్ యార్డ్‌లో పేలుడు.. ఇద్దరికి గాయాలు
ఇవీ చదవండి: