Road Accident in America: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఎమ్మెస్ చదివే ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. చికాగో సమీపంలోని అలెగ్జాండర్ కౌంటీ వద్ద గురువారం తెల్లవారుజామున 4.15 గంటలకు ఈ ఘటన జరిగింది. గురువారం షాపింగ్‌కు వెళ్తున్న విద్యార్థుల కారును ఎదురుగా వస్తున్న మరో కారు బలంగా ఢీ కొట్టింది.
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి - అమెరికాలో రోడ్డు ప్రమాదం
Road Accident in America: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. చికాగో సమీపంలోని అలెగ్జాండర్ కౌంటీ వద్ద గురువారం తెల్లవారుజామున 4.15 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో నిజాంపేటలో నివాసముండే జేఎన్‌టీయూ ప్రొఫెసర్ పద్మజా రాణి చిన్న కుమారుడు పీచెట్టి వంశీకృష్ణ(23), అతని స్నేహితుడు పవన్ స్వర్ణ(23) అక్కడికక్కడే మృతి చెందారు. అదే కారులో ఉన్న వారి స్నేహితులు డి.కల్యాణ్, కె.కార్తీక్, ఉప్పలపాటి శ్రీకాంత్‌లకు గాయాలయ్యాయి. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి వంశీకృష్ణ ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వంశీకృష్ణ అందరితో కలివిడిగా ఉండేవాడని.. ఇలా ప్రమాదంలో తమను వదిలి వెళ్తాడనుకోలేదని తండ్రి కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహాలు సోమవారం నగరానికి వచ్చే అవకాశం ఉన్నట్టు తండ్రి వరప్రసాద్ తెలిపారు. వంశీకృష్ణ మృతికి అమెరికాలో కళాశాల ఉపాధ్యాయులు, స్నేహితులు నివాళులర్పించారు.
ఇవీ చదవండి: