తెలంగాణ

telangana

ETV Bharat / crime

కత్తులతో ఇరువర్గాల ఘర్షణ... ఐదుగురికి తీవ్ర గాయాలు - ఫకీరాబాద్‌లో ఇరువర్గాల ఘర్షణ

నిజామాబాద్‌లో పాతకక్షలు భగ్గుమన్నాయి. జిల్లాలోని నవీపేట మండలం ఫకీరాబాద్‌లో రెండు వర్గాలు పరస్పరం గొడవకు దిగాయి. ఒకరిపై ఒకరు కత్తులు, కర్రలతో మూకుమ్మడిగా దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు.

two groups attack each other phakirabad village
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ గ్రామంలో ఇరువర్గాల దాడులు

By

Published : May 1, 2021, 12:35 PM IST

పాతకక్షలు పచ్చని పల్లెల్లో కలకలం సృష్టిస్తున్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా.. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ గ్రామంలో జరిగింది. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘర్షణలో అనిల్, గంగాధర్, నరేందర్, లింగన్న, నారాయణలకు తీవ్రగాయాలయ్యాయి.

గ్రామానికి చెందిన రెడ్డిపల్లి గంగాధర్ ,చిల్లర్గ నారాయణ కుటుంబాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. గొడవలకు పాత కక్షలే కారణమని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:ప్రైవేటు ఆసుపత్రులు కొవిడ్‌ సేవల నిలుపుదలపై కలెక్టర్‌ ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details