పాతకక్షలతో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం యనంపల్లితండాలో రాత్రి సమయంలో జరిగింది.
ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. ఇదివరకే పాతకక్షలు ఉండటం ఘర్షణకు ప్రధాన కారణమైంది. ఈ దాడిలో రవి అనే వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.