తెలంగాణ

telangana

ETV Bharat / crime

two groups attack : కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి.. ముగ్గురికి తీవ్రగాయాలు - గొడ్డళ్లతో దాడి

two groups attack : భూవివాదం రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఒకరిపై ఒకరు కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడులు చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

two groups attack
కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి

By

Published : May 30, 2022, 9:13 AM IST

two groups attack : ఓ భూవివాదంలో తలెత్తిన గొడవ ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు కారణమైంది. ఓ స్థల విషయంపై వివాదం రావడంతో ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఏకంగా కత్తులు, గొడ్డళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్లలో ఈ ఘర్షణ జరిగింది.

ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రగాయాలైన బాధితులను బాల్కొండ నియోజకవర్గ భాజపా నాయకుడు యేలేటి మల్లికార్జునరెడ్డి పరామర్శించారు. బాధితులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్మూర్​ ఏసీపీకి ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details