Farmers suicide :ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓవైపు పంట నష్టం... మరోవైపు అప్పులబాధ.. చేసేది లేక ఇద్దరూ... పురుగుల మందు తాగి... బలవన్మరణం చెందారు.
అప్పు ఎలా తీర్చాలో తెలియక..
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రామోజీ తండాకు చెందిన గుగులోతు రాజారాం ఎకరం భూమి కౌలుకు తీసుకొని మిరప పంట సాగు చేశారు. దాదాపు లక్షకు పైగా పెట్టుబడి పెట్టారు. ఆరుగాలం చెమటోడ్చి సాగు చేశారు. దిగుబడి రాకపోవటంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించగా... చికిత్స పొందుతూ మృతిచెందాడు.