కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములుమెరుపులతో కూడిన వర్షం కురిసింది.
పిడుగు పడి ఇద్దరు రైతులు మృతి
నేల తల్లని నమ్ముకున్న ఆ రైతులు ఆ నేల తల్లి ఒడిలోనే ఒదిగిపోయారు. మృత్యురూపంలో వచ్చిన పిడుగు అన్నదాతలను అమరులను చేసింది. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో జరిగింది.
పిడుగు పడి ఇద్దరు రైతులు మృతి
గ్రామ శివారులో తమ వ్యవసాయ క్షేత్రం వద్ద పనులు చేసుకుంటున్న ఇద్దరు రైతులు ఓరుసు మల్లయ్య (55), అల్లేపు రవి (45) దగ్గరలో ఉన్న పశువుల కొట్టంలోకి వెళ్లారు. పశువుల కొట్టంపై పిడుగు పడటంతో రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
ఇదీ చదవండి: మానసిక వైద్యుల సూచనల కోసం.. సీ-19 టాస్క్‌ఫోర్స్