తెలంగాణ

telangana

ETV Bharat / crime

Conflicti: కౌన్సిలింగ్​ కోసం వచ్చారు.. పోలీస్‌ స్టేషన్​ ముందే కొట్టుకున్నారు - Conflicti at Godavarikhani

భార్యాభర్తల మధ్య జరిగిన వివాదాన్ని పరిష్కరించుకునేందుకు పోలీస్‌ స్టేషన్​ వచ్చిన ఇరు కుటుంబ సభ్యులు... ఠాణా ఆవరణలోనే కొట్టుకున్నారు. బావా బామర్దులు ఒకరికొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. వారిద్దరిని విడిపించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు.

Conflicti
Conflicti

By

Published : Oct 7, 2021, 1:14 PM IST

కౌన్సిలింగ్​ కోసం పోలీస్‌ స్టేషన్​ వచ్చిన కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ...

భార్యాభర్తల మధ్య జరిగిన వివాదాన్ని పరిష్కరించుకునేందుకు పోలీస్‌ స్టేషన్​ వచ్చిన ఇరు కుటుంబ సభ్యులు... ఠాణా ఆవరణలోనే కొట్టుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటుచేసుకుంది. మార్కండేయనగర్‌ కాలనీకి చెందిన అబ్బాయితో ద్వారకా నగర్‌కు చెందిన అమ్మాయికి వివాహం జరిగింది. కొంత కాలం వారి వివాహ దాంపత్యం చుడముచ్చటగా సాగింది. అంతలో ఆమె గర్భం దాల్చింది. ఇక అప్పటి నుంచి వారి ఇరువురి మధ్య గొడవ మొదలైంది.

ఈనెల 1న ఆమె మగశిశువుకు జన్మనివ్వగా చూడటానికి వెళ్లిన భర్త మరోసారి మరోసారి గొడవ చేశాడు. దీంతో ఒకటో ఠాణాకు చెందిన పోలీసులు కౌన్సిలింగ్​ కోసం ఇరుకుటుంబ సభ్యులను పిలిచారు. కౌన్సిలింగ్ అనంతరం పోలీస్‌ స్టేషన్‌ బయటికి వచ్చిన వారు ఘర్షణకు దిగారు. బావ బామర్దులు బాహాబాహీగా తలపడ్డారు. ఒకరికొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. వారిద్దరిని విడిపించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు. ఇరువురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చదవండి:Child Sexual Abuse: 'అమ్మా నాకు నొప్పి వస్తోంది.. ఆ అంకుల్​ ఏదో చేశాడు'

ABOUT THE AUTHOR

...view details