తెలంగాణ

telangana

ETV Bharat / crime

మద్యం మత్తులో వేగం.. తీసింది ఇద్దరి ప్రాణం - telangana news

మద్యం మత్తులో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందారు. మితిమీరిన వేగంతో వెళ్తున్న వారి బైక్‌ అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్‌ని వేగంగా ఢీ కొట్టింది. ఆ వేగానికి గాల్లోకి ఎగిరిపడి ఇద్దరు మృత్యువాత పడ్డ దృశ్యాలు.. సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి.

Two died in road accident due to alcohol intoxication at medchal
మద్యం మత్తులో వేగం.. తీసింది ఇద్దరి ప్రాణం

By

Published : Feb 4, 2021, 6:45 PM IST

మద్యం మత్తులో అతి వేగంగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ ఇద్దరు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్​లో చోటుచేసుకుంది. దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి గండిమైసమ్మ వైపు మనోజ్, దినేష్ సాయి అనే వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మద్యం మత్తులో వేగంగా వెళ్తున్న క్రమంలో.. వారు అదుపుతప్పి డివైడర్‌ని బలంగా ఢీ కొట్టారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి.

సీసీ కెమెరాలో రోడ్డు ప్రమాద దృశ్యాలు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అంబులెన్స్​లో గాంధీ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మద్యం మత్తులో అతివేగంగా ద్విచక్రవాహనం నడిపినట్లు పోలీసులు తెలిపారు. మనోజ్ స్థానికంగా ఓ హోటల్​లో పనిచేస్తుండగా... దినేష్ సాయి సెక్యురిటీ గార్డుగా విధులు నిర్వహిస్తుంటాడని పోలీసులు గుర్తించారు. ఘటనపై దుండిగల్ పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:ఆటోను ఢీకొన్న వ్యాన్​.. ముగ్గురు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details