నారాయణ పేట జిల్లా కృష్ణ మండలం 167వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. గుడెబల్లూర్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రులను కర్ణాటకలో రాయచూరు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Accident: ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు.. ఇద్దరు మృతి - two died in road accident at krishna mandal
నారాయణపేట జిల్లా కృష్ణ మండలం జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
కృష్ణ మండలంలో రోడ్డు ప్రమాదం
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను నియంత్రించారు. మృతుల వివరాలు, కారులో ప్రయాణిస్తున్న వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.