BBNagar Road Accident: హైదరాబాద్- వరంగల్ ప్రధాన రహదారి బీబీనగర్ టోల్‌గేట్ మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ట్రాలీ ఢీకొట్టిన ప్రమాదంలో డ్రైవర్ సహా మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. అదే సమయంలో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పలు కార్యక్రమాలకు హాజరుకావడానికి వెళ్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘటనాస్థలి వద్ద ఆగారు. ప్రమాదాన్ని చూసి వెంటనే పోలీస్ అధికారులను పిలిపించి అక్కడే ఉండి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం చేశారు.
BBNagar Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. మంత్రి సహాయక చర్యలు - Bbnagar road accident news
BBNagar Road Accident: బీబీనగర్ టోల్‌గేట్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి ఘటనాస్థలిని పరిశీలించారు.
Accident
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం తోటపల్లికి చెందిన అనిల్ అనే వ్యక్తి ట్రాలీ డ్రైవర్ కాగా.. అతను, వరంగల్‌కు చెందిన ఖలీల్ అనే మరో వ్యక్తితో కలిసి గుడిమల్కాపూర్‌కు వెళ్లాడు. అక్కడ పూల వ్యాపారి దగ్గర పూలు తీసుకొని తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో వరంగల్‌కు బయల్దేరారు. బీబీనగర్ దాటాక టోల్‌గేట్ కంటే ముందు ఆగి ఉన్న లారీని ఢీకొనగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
- ఇదీ చదవండి :ఇండోమెథాసిన్‌తో కొవిడ్‌కు సమర్థ చికిత్స