తెలంగాణ

telangana

ETV Bharat / crime

ACCIDENT: బైకును ఢీకొట్టిన కారు.. ఇద్దరు స్పాట్​ డెడ్​ - jagtial district crme news

ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బైకును ఢీకొట్టిన కారు.. ఇద్దరు స్పాట్​ డెడ్​
బైకును ఢీకొట్టిన కారు.. ఇద్దరు స్పాట్​ డెడ్​

By

Published : Jun 14, 2021, 5:09 AM IST

జగిత్యాల జిల్లా కేంద్రం సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఓ కుటుంబం కారులో కోరుట్ల నుంచి జగిత్యాల వైపు వెళ్తుండగా.. ద్విచక్రవాహనంపై కోరుట్లకు వస్తున్న షికారి యశ్వంత్​ అనే వ్యక్తిని వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో యశ్వంత్​, కారులో ఉన్న సమీర్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో జగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: విద్యుదాఘాతంతో రైతు మృతి.. సబ్‌స్టేషన్‌ ముందు బంధువుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details