Cherlagudem incident: సంగారెడ్డి జిల్లా కంది మండలం చెర్లగూడెంకు చెందిన ఆలకుంట జములయ్య, భార్య యాదమ్మ పిల్లలతో కలిసి అమీన్‌పూర్ నర్రెగూడలో ఉంటున్నారు. జములయ్య ఐలాపూర్ తండా పంచాయతీలో పని చేస్తుండగా.. భార్య యాదమ్మ ఇళ్లల్లో పనులుచేస్తోంది. వారికి ఇద్దరుకుమార్తెలు. చిన్న కుమార్తె లావణ్యతో కలిసి యాదమ్మ శనివారం మధ్యాహ్నం బట్టలు ఉతికేందుకు.. ఐలాపూర్ చెరువుకు వెళ్లింది. చెరువులో మునిగి ఇద్దరూ గల్లంతయ్యారు.
సాయంత్రం ఇంటికి వచ్చిన జములయ్య.. మరికొంత మందితో కలిసి శనివారం రాత్రి చెరువువద్దకు వెళ్లి చూడగా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం లావణ్య మృతదేహం నీటిపై తేలింది. యాదమ్మ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. విషయం తెలియడంతో బోడుప్పల్‌లో ఉండే యాదమ్మ సోదరుడు ఉసిరయ్య.. ఐలాపూర్ చెరువు వద్దకు వచ్చారు. గాలించేందుకు చెరువులోకి దిగాడు. ఎక్కువ లోతు, పిచ్చి మొక్కలు ఉండటంతో నీటిలో మునిగిపోయారు.