Road accident in Nalgonda: రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు - chinthapally road accident news
07:17 November 12
ఆగి ఉన్న లారీని ఢీకొన్న క్రూజర్, ముగ్గురు మృతి
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ వద్జ ఘోర రోడ్డు ప్రమాదం(Road accident in Nalgonda) చేటుచేసుకుంది. స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో ఆగి ఉన్న లారీని క్రూజర్ వాహనం ఢీకొట్టింది. దీంతో ఘటనాస్థలంలో ఇద్దరు(Road accident in Nalgonda) అక్కడికక్కడే మృతి చెందాారు. మరొకరు చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఎనిమిది మంది గాయపడ్డారు.
తెల్లవారు జామున మర్రిగూడెం మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన 11 మంది రంగారెడ్డి జిల్లా కొలుకులపల్లి గ్రామానికి వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఆ సమయలో ఈ ప్రమాదం(Road accident in Nalgonda) సంభవించింది. మృతులు రాములు, సత్తయ్య, పాండుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి:TRS dharna: తెరాస ధర్నా ఏర్పాట్లలో అపశృతి.. విద్యుదాఘాతంతో యువకుడు మృతి