ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో జరిగింది. బోర్లం గ్రామానికి చెందిన బాలయ్య, బాన్సువాడ సంగమేశ్వర కాలనికి చెందిన గూడ వెంకట్ కలిసి రాత్రి సమయంలో కల్కి చెరువులో చేపల వేటకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు.
చేపల వేటకు వెళ్లిన ఇద్దరు మృతి... - కామారెడ్డి నేర వార్తలు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు కల్కి చెరువులో పడి ఇద్దరు మృతి చెందారు.
banswada
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:బహిర్భూమికి వెళ్లి.. కాల్వలో గల్లంతైన బాలుడు