ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో గుర్తుతెలియని భార్యాభర్తల మృతదేహాలు కలకలం సృష్టించాయి. బకింగ్‌హామ్ కెనాల్ పక్కనే ఉన్న ఓ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా సుమారు 45 సంవత్సరాలు ఉన్న భార్యాభర్తల మృతదేహాలను పోలీసులు గుర్తించారు.
ఆ ఇంట్లోని రెండు మృతదేహాలు ఎవరివి..? - crime news
ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో దంపతుల మృతదేహాలు కలకలం రేపాయి. వారిని హత్య చేశారా..? లేక వారే ఆత్మహత్య చేసుకున్నారా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాలకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక సమాచారం లభించలేదు.
ఇంటి మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. కనీసం వారి ఊరు, పేరు ఇతర వివరాలు ఇంట్లో లేకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దంపతుల మృతదేహాలు పడి ఉన్న ప్రాంతంలో మందులు, ఇతర ఆధ్యాత్మిక సిడీలు లభ్యమైనట్లు పోలీసులు చెప్పారు. జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు దొరికినట్లు తాడేపల్లి సీఐ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. మృతదేహాలకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక సమాచారం లభించలేదన్నారు.
ఇదీ చదవండి:illegal affair: వివాహేతర సంబంధం.. వ్యక్తి ప్రాణం తీసింది!