Dead bodies found in pond: కుంటలో చిన్నారుల మృతదేహాలు.. చంపిందెవరు? - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
![Dead bodies found in pond: కుంటలో చిన్నారుల మృతదేహాలు.. చంపిందెవరు? dead bodies found in pond, dead bodies in water](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13646011-408-13646011-1637038992158.jpg)
09:52 November 16
కుంటలో మృతదేహాలు.. చంపిందెవరు?
మెదక్ జిల్లా టేక్మాల్ మండలం దాదాయిపల్లిలో రెండు మృతదేహాలు(Dead bodies found in pond) లభ్యం కావటం కలకలం రేపింది. దాదాయిపల్లి శివారులోని గచ్చుకుంటలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు గ్రామస్థులు గుర్తించారు. నాలుగేళ్ల రిశ్వంత్, రెండేళ్ల రక్షిత చనిపోయినట్లుగా తేల్చారు. చిన్నారుల తల్లి కోటంగారి రంజిత కోసం గ్రామస్థులు గాలిస్తున్నారు. భర్తే హత్య చేసి కుంటలో పడేసినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు.
రంజిత భర్త రాజు రెండు వివాహాలు చేసుకున్నాడని గ్రామస్థులు తెలిపారు. రంజితను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్న రాజు....భార్య, పిల్లలు ఇంట్లో నుంచి వెళ్లిపోయారని గ్రామస్థులకు చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు రాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదీ చదవండి:Imprisonment: బాలిక కిడ్నాప్, ఆపై పెళ్లికి యత్నం.. నిందితుడికి నాలుగేళ్ల కఠిన కారాగారం