తెలంగాణ

telangana

Judgment in a rape case: 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం కేసులో కోర్టు కీలక తీర్పు..

By

Published : Feb 10, 2022, 7:59 PM IST

Judgment in a rape case: 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం కేసులో మల్కాజిగిరి కోర్టు తీర్పు వెలువరించింది. అన్ని సాక్షాధారాలు పరిశీలించిన ధర్మాసనం.. ఇద్దరు నిందితులను దోషులుగా తేల్చుతూ శిక్ష విధించింది. ఇద్దరు దోషులకు జీవిత ఖైదుతో పాటు 5 వేల జరిమానా కూడా విధించింది.

Two convicts sentenced to life imprisonment for raping 70 year old woman in malakjigiri
Two convicts sentenced to life imprisonment for raping 70 year old woman in malakjigiri

Judgment in a rape case: 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసిన ఇద్దరు నిందితులకు మల్కాజిగిరి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2019లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు సాక్షాధారాలను కోర్టు ఎదుట సమర్పించగా.. నిందితులిద్దరిని దోషులుగా ధర్మాసనం తేల్చింది. ఇద్దరికీ జీవిత ఖైదుతో పాటు 5 వేల రూపాయల జరిమానా కూడా విధించింది.

గదికి తీసుకెళ్లి.. కల్లు తాగించి..

మాల్కాజిగిరి ఠాణా పరిధిలో 2019 డిసెంబర్ 17న కల్లు దుకాణం వద్ద ఉన్న వృద్ధురాలితో.. పెయింటర్లుగా పని చేస్తున్న ఆంథోని జార్జ్(50), విజయ్(53) మాట కలిపారు. వృద్ధురాలిని తమ గదికి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురూ కలిసి కల్లు సేవించారు. ఎక్కువ మోతాదులో కల్లు సేవించిన వృద్ధురాలు మత్తులోకి జారుకుంది. ఇదే అదునుగా చేసుకుని ఆంథోని, విజయ్ కలిసి వృద్ధురాలిపై అత్యాచారం చేశారు.

మెలకువలోకి వచ్చాక..

మెలకువలోకి వచ్చిన వృద్ధురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు గమనించి గది వద్దకు వెళ్లారు. వృద్ధురాలిపై అత్యాచారం జరిగినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. మాల్కాజిగిరి కోర్టులో విచారణ సందర్భంగా పోలీసులు ఆధారాలు సమర్పించడంతో పాటు... సాక్షులను కోర్టులో హాజరుపర్చారు.

సీపీ అభినందనలు..

అన్ని ఆధారాలను పరిశీలించిన ధర్మాసనం.. ఇద్దరు నిందితులను దోషులుగా తేల్చింది. ఇద్దరికీ జీవితఖైదు విధిస్తూ.. తీర్పునిచ్చింది. నిందితులకు శిక్ష పడేలా దర్యాప్తు నిర్వహించిన మల్కాజిగిరి పోలీసులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్​ను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అభినందించారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details