ఆలయంలోకి దూసుకెళ్లిన వాహనం.. ఇద్దరు చిన్నారులు మృతి, 10మందికి గాయాలు - ఆలయంలోకి దూసుకెళ్లిన వాహనం.. ఇద్దరు చిన్నారులు మృతి
22:41 April 10
ఆలయంలోకి దూసుకెళ్లిన వాహనం.. ఇద్దరు చిన్నారులు మృతి, 10మందికి గాయాలు
Two Died in Accident: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడులో విషాదం జరిగింది. ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులపైకి వాహనం దూసుకెళ్లగా ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ప్రమాదంలో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో డ్రైవర్ వాహనం నడిపినట్లు స్థానికుల ఆరోపిస్తున్నారు.
బొలెరో వేగంగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆ తర్వాత ఆలయం ప్రహరీ గోడ నుంచి లోపలికి దూసుకెళ్లింది. భక్తుల పైకి దూసుకెళ్లడంతో దేదీప్య, సహస్ర అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి.. ఇళ్లపైకి దూసుకెళ్లిన లారీ