ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని మండలం కడితోట గ్రామానికి చెందిన అనిల్, వీరేంద్రలు సమీపంలోని పొలంలో ఆడుకోవడానికి వెళ్లారు. అక్కడే ఉన్న నీటి కుంటలో సరదాగా ఈత కొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు నీట మునిగిపోయారు.
విషాదం: నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి - kurnool district latest news
ఏపీలోని కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. కడితోట గ్రామంలో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీట మునిగి మృతి చెందారు.
![విషాదం: నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి two children died to drop into dig at kadithota](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12039661-196-12039661-1622990489691.jpg)
two children died to drop into dig at kadithota
గమనించిన స్థానికులు.. చిన్నారులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందారు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తమ పిల్లలు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు రోధించిన తీరు కంటతడి పెట్టించింది.