చిన్నారులకు ఇష్టమైన చికెన్ వాళ్ల ప్రాణాలను బలితీసుకుంది. తల్లి చేసిన చికెన్ తిని ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో విషాదం నెలకొంది.
Contaminated food: కలుషిత ఆహారం తిని ఇద్దరు చిన్నారులు మృతి - తెలంగాణ వార్తలు
11:37 August 17
కలుషిత ఆహారం తిని ఇద్దరు చిన్నారులు మృతి
తూప్రాన్ మండలం వెంకటాయపలికి చెందిన మల్లేష్, బాలమణి దంపతులు మనోహరాబాద్‌లో ఐలయ్యకు చెందిన కోళ్ల ఫాంలో ఏడాదిగా పని చేస్తున్నారు. అక్కడే నివాసం ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వీరికి మనీశ , కుమార్ ఇద్దరు సంతానం ఉన్నారు.
తల్లి బాలమణి సోమవారం రాత్రి చికెన్ వండగా అందరూ కలిసి తిన్నారు. ఆహారం కలుషితమవగా తెల్లవారుజామున పిల్లలు అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. అప్రమత్తమైన తల్లిదండ్రులు వారిని.. తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి మేడ్చల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి చిన్నారులు మృతి చెందినట్లు తెలిపారు. తల్లి బాలమణి తీవ్ర అస్వస్థతకు గురికాగా మెరుగైన వైద్యం కోసం కొంపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల మృతిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:MURDER: ప్రేమతో రమ్మంది.. భర్తతో కలిపి గొంతుకోసి యువకుడిని చంపేసింది!